Prabhas Fouji : ప్రభాస్ షూటింగ్ లో సీనియర్ యాక్టర్ కు గాయం

Update: 2025-04-16 08:30 GMT

ప్రభాస్ మూవీ షూటింగ్ లో సీనియర్ యాక్టర్ గాయపడ్డాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఫౌజీ కోసం ప్రభాస్ చాలా ఎక్కువ టైమ్ కేటాయించాడు. ఈ కథ అతనికి విపరీతంగా నచ్చింది. అందుకే హను కంటే ముందే కమిట్ అయిన సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ ను కూడా హోల్డ్ లో పెట్టాడు. ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో కథ ఉంటుందట. ఆ మేరకు ప్రభాస్ మేకోవర్ కూడా అదిరిపోతుందంటున్నారు.

ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో సీనియర్ బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఫోటో షూట్ సందర్భంగా అతను ప్రమాదవశాత్తూ పడిపోయాడు. చేయి విరిగిందట. కొన్ని రోజులుగా రెస్ట్ లో ఉన్న మిథున్ త్వరలోనే మళ్లీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నానని చెప్పాడు. తనతో పాటు జయప్రద కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోందీ చిత్రంలో అని కూడా చెప్పాడు. ఇప్పటికే అతనికి సంబంధించి ఒక షెడ్యూల్ లో రెండు రోజుల చిత్రీకరణ అయిపోయిందట. నెక్ట్స్ షెడ్యూల్ లో ప్రభాస్ తో కలిసి నటించబోతున్నా అన్నాడు.

ఇక ఈ సినిమా గురించి, ప్రభాస్ గురించి ఓ రేంజ్ లో పొగడ్తలు కురిపించాడీ సీనియర్ యాక్టర్. మిథున్ బాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. అది సినిమాకు కొంత ప్లస్ అవుతుంది. మూవీ కంటెంట్ ప్రకారం చూస్తే అతను ఆర్మీ ఆఫీసర్ లేదా అతనూ జయప్రద కలిసి ప్రభాస్ కు పేరెంట్స్ గా నటిస్తూ ఉండొచ్చు.

Tags:    

Similar News