Senior Actress Jayamalini: స్టార్ హీరోని ప్రేమించా.. మరణించేలోపు వెళ్లి చెబుతా: జయమాలిని
Senior Actress Jayamalini: జయమాలిని.. నిన్నటి తరం ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఓ స్పెషల్ సాంగ్ లో నటించి అలరించారు.;
Senior Actress Jayamalini: జయమాలిని.. నిన్నటి తరం ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఓ స్పెషల్ సాంగ్ లో నటించి అలరించారు. అలనాటి నటి, డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జయమాలిని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అప్పట్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. జయమాలిని సినిమాలో ఉందంటే ఆ సినిమా సూపర్ హిట్టే అని అనుకునేవారు దర్శక నిర్మాతలు. ఇక జయమాలిని హీరో, హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్.. షూటింగ్ గ్యాప్‌లో ఆమెను చూడడానికి అభిమానులు వచ్చేవారు. ఒక్కోసారి వారిని కట్టడి చేయడం యూనిట్ సభ్యులకు కష్టంగా మారేది. చాలా సినిమాల్లో డ్యాన్సర్‌గా రాణిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రెండు దశాబ్దాలకు పైగా వెండితెరపై డ్యాన్సర్‌గా అలరిస్తున్న ఆమె ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు. ఇండస్ట్రీలో తనకు చాలా మంది ప్రపోజ్ చేశారని తెలిపారు. పెళ్లి కూడా చేసుకుంటామని వెంటపడ్డారు. ఇక ప్రేమ లేఖల గురించి చెప్పక్కర్లేదు.. రోజూ పోస్ట్ మ్యాన్ ప్రేమ లేఖలను మోసుకొచ్చేవాడు.. వాటిని చదవడానికి ఓ మనిషిని కూడా పెట్టుకున్నాను అంటే అర్థం చేసుకోండి ఎన్ని ప్రేమలేఖలు వచ్చేవో అని అన్నారు. అందులో కొన్ని ప్రేమ లేఖలు రక్తంతో రాసినవి కూడా ఉండేవి. ఓ మిలటరీ ఆఫీసర్ కూడా నాకు ప్రేమలేఖ రాశాడు. పెళ్లి విషయమై మా అమ్మా నాన్నలతో కూడా మాట్లాడతానని చెప్పాడు.
మరికొందరు మా అమ్మను అడిగే ధైర్యం లేక అక్క (జ్యోతిలక్ష్మి)ని ఒప్పించే ప్రయత్నం చేశారని ఆ రోజుల్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. మరి ఇంత మంది తనను ప్రేమిస్తున్నానని చెబితే.. తాను మాత్రం ఓ స్టార్ హీరోను ప్రేమించానని చెప్పింది. 'నేను ఓ స్టార్ హీరోని ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. కానీ ఆ విషయం బయటకు రాలేదు. మొదట అతను నన్ను ప్రేమించాడు.
ఓ సారి షూటింగ్ సమయంలో రాత్రి నా దగ్గరకు వచ్చి చెప్పాలని ప్రయత్నించారు. కానీ ఎందుకో వెనుకడుగు వేశారు. నాది కూడా అదే పరిస్థితి. నేను కూడా అతడిని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పలేకపోయాను. ఇప్పుడు ఇద్దరం ఎవరి జీవితాల్లో వాళ్లం ఉన్నాం.. నా భర్త నన్ను బాగా చూసుకుంటారు. నేను ప్రేమించిన హీరోకి కూడా పెళ్లయి పిల్లలు ఉన్నారు. అయితే నేను అతడిని ప్రేమించిన విషయం నేను మరణించేలోపు వెళ్లి చెప్పి వస్తా అని తన లవ్ స్టోరీని పంచుకున్నారు జయమాలిని.