Actress B. Saroja Devi : సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూత

Update: 2025-07-14 05:49 GMT

ప్రముఖ కన్నడ నటి బి. సరోజాదేవి (87) సోమవారం (జూలై 14) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ బెంగళూరులోని మల్లేశ్వరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జనవరి 7, 1938న జన్మించిన ఆమె కన్నడ, తమిళం, తెలుగు, హిందీ సహా 5 భాషల్లో 200కు పైగా చిత్రాలలో నటించారు. 'అభినయ సరస్వతి'గా పిలువబడే ఆమె 6 దశాబ్దాల పాటు కన్నడతో సహా వివిధ భాషలలో నటించారు. చలనచిత్ర పరిశ్రమకు ఆమె చేసిన అపారమైన సేవకు గాను చాలా అవార్డులు ఆమెను వరించాయి. 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, తమిళనాడు నుండి కలైమామణి అవార్డు అందుకున్నారు. 'మహాకవి కాళిదాస' (1955) చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు సరోజాదేవి , రాజ్‌కుమార్, కళ్యాణ్ కుమార్ వంటి ప్రముఖులతో వెండితెరను పంచుకున్నారు.'కిత్తూరు చెన్నమ్మ', 'అన్న తమ్మ', 'భక్త కనకదాస', 'బాలే బంగార', 'నాగకన్యే', 'బెట్టాడ హూవు', 'కస్తూరి నివాస్‌' వంటి పలు కన్నడ చిత్రాలలో నటించారు. తమిళంలో 'నాడోడి మన్నన్', 'కర్పూర కరాసి', 'తిరుమానం' తదితర చిత్రాల్లో నటించిన ఆమె.. తెలుగులో 'పాండురంగ మహత్యం', 'భూకైలాస్', 'పెళ్లి సందడి' తదితర చిత్రాల్లో నటించారు. సరోజాదేవి హిందీలో దిలీప్ కుమార్ 'పైగం', 'ఆశా', 'మెహందీ లగా కే రఖ్నా' వంటి చిత్రాలలో నటించారు. ఆమె చివరిసారిగా 2019లో విడుదలైన పునీత్ రాజ్‌కుమార్ 'నాట్ సార్వభౌమ'లో నటించారు.

Full View

Tags:    

Similar News