జులై నెలలో ఏడు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. అన్నట్టు ఇది ఏడో నెల కూడా కావడం మరో విశేషం. ఈ ఏడింటిలో స్టార్ హీరోల సినిమాలు ఒకటి రెండు మాత్రమే ఉంటే.. మిగిలిన సినిమాలు చిన్న హీరోల సినిమాలే. అవి కూడా మీడియం బడ్జె ట్ తో చిత్రీకరించినవే కావడం విశేషం. వీటిలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్న సినిమాలు మిరపకాయ్, గజిని, ఏమాయ చేశావే. ఈ మూడు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు నమోదు చేస్తాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఈ మూడు సినిమాలతో పాటు ఎంఎస్ ధోనీ, కుమారి 21ఎఫ్, హుషారు, వీడొక్కడే సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ఈ నెల హుషారు సినిమా రీ రిలీజ్ తో ప్రారంభం కాబోతుంది. ఈ నెల 4న హుషారు సినిమా రీ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 7న ఎంఎస్ ధోనీ సినిమా దిగనుంది. హిందీ సినిమాకు డబ్బింగ్ అయినప్పటికీ తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అందుకే రీ రిలీజ్ మంచి వసూళ్లు సొంతం చేసుకునే అవకాశా లు ఉన్నాయి. ఈ నెల 10న రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన కుమారి 21ఎఫ్ సినిమా రీ రిలీజ్ కాబోతుంది. 11న మిరపకాయ్ సినిమా రీ రిలీజ్కు రెడీగా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించాడు. మంచి హిట్ బొమ్మ అయిన మిరపకాయ్ కచ్చితం గా రీ రిలీజ్లోనూ సూపర్ హిట్గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. 18న గజిని సినిమా విడుదల కాబోతుంది. 19న నాగ చైతన్య, సమంతల కల్ట్ లవ్ స్టోరీ ఏ మాయ చేశావే రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాతే నాగచైతన్య, సమంత మధ్య లవ్ స్టార్టయిందని చెబుతారు. వీళ్లిద్దరూ డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. గజిని, ఏమాయ మిరపకాయ్ జులై 19న వీడొక్కడే సినిమా రీ రిలీజ్ కానుంది. సూర్య, తమన్నా నటించిన ఈ తమిళ సినిమాకు తెలుగులో రీ రిలీజ్ ఎలాంటి స్పందన దక్కుతుందో చూడాలి.