కొన్నాళ్ల క్రితం మీ టూ అనే మాట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా పరిశ్రమలను ఊపేసింది. సినిమా ఇండస్ట్రీలో ఆడవారికి రక్షణ లేదు అంటూ ఆ టైమ్ చాలామంది లేడీ ఆర్టిస్టులు బాహాటంగానే ఇండస్టీలో తమకు ఎదురైన బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ లను షేర్ చేసుకున్నారు. ఇది టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ జరిగింది. సౌత్ లో అయితే కొన్ని కమిటీస్ కూడా వేశారు. అవన్నీ ఎలా ఉన్న మనుషుల వ్యక్తిత్వాలు మారనంత వరకూ ఇవి ఆగవు అని మరో సంఘటన చెబుతోంది.
రీసెంట్ గా భగవంత్ కేసరి, సలార్ వంటి మూవీస్ తో తెలుగు వాళ్లకు బాగా దగ్గరయిన నటుడు జాన్ విజయ్ పై ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. దీనికి సంబంధంచిన స్క్రీన్ షాట్స్ తో సహా చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జాన్ విజయ్ తమిళ్ డబ్బింగ్ మూవీస్ ద్వారా కూడా మనవాళ్లకు బాగానే పరిచయం. విశాల్ డిటెక్టివ్ తో పాటు ఆర్య సార్పట్టై అనే మూవీస్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని సినిమాల్లో అతని పాత్రలు కూడా పర్వర్టెడ్ గానే ఉంటాయి. అది వెండితెరపైనే కాక రియల్ లైఫ్ లో కూడా చూపించాడు అంటూ తాజాగా ఓ మళయాల టీవి యాంకర్ పోస్ట్ చేసింది. అక్కడి ఓ టాప్ హీరోను ఇంటర్వ్యూ చేయడానికి తను వెయిట్ చేస్తోన్న టైమ్ లో జాన్ విజయ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ.. ఆ టైమ్ లో తను బాగా ఇబ్బంది పడ్డాను అని చెప్పింది. ఆ యాంకర్ తర్వాత అతనితో అలాంటి అనుభవాలే ఎదురైన మరికొందరు మహిళలు కూడా అతను అలాంటివాడే అంటూ తమకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పారు. ఇవన్నీ కలిపి చిన్మయి అతనిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది. మరి ఈ విషయంలో జాన్ విజయ్ రియాక్షన్ చూస్తే.. తను ఇంటెన్షనల్ గా ఎవరినీ ఇబ్బంది పెట్టలేదనీ.. తన జోకులు అందరికీ అన్ని సందర్భల్లో అర్థం కావని.. అందుకే ఇలా జరిగిందని చెబుతున్నాడు. బట్ అతనే చెప్పినా.. ఈ వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్ ల దుమారం రేపుతోంది.