Shahid Kapoor: భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన సినిమా..
Shahid Kapoor: షాహిద్ కపూర్ నటించిన ‘ఉడ్తా పంజాబ్’ ఎన్నో అవార్డులను అందుకోవడంతో పాటు తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.;
Shahid Kapoor: సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య వివాహాలు చాలా అరుదు. ఎక్కువగా బయట వ్యక్తులతోనే నటుల వివాహాలు జరుగుతుంటాయి. అలా పెళ్లి చేసుకున్నవారే షాహిద్ కపూర్, మీరా కూడా. మీరాకు, సినీ పరిశ్రమకు అస్సలు సంబంధం లేదు. అందుకే షాహిద్ కపూర్ నటించిన ఓ సినిమా వీరిద్దరి మధ్య చిచ్చుపెట్టిందట. ఇటీవల ఈ విషయాన్ని షాహిద్.. అభిమానులతో పంచుకున్నాడు.
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్ హీరో స్థానాన్ని దక్కించుకున్న వారిలో షాహిద్ కపూర్ ఒకడు. కెరీర్ ప్రారంభమయినప్పటి నుండి షాహిద్ ఖాతాలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ కొన్నాళ్లకే సరిగ్గా అవకాశాలు రాకా.. చేసే సినిమాలు కూడా సక్సెస్ అవ్వక.. కెరీర్‌ను చాలా కష్టంగా నెట్టుకొచ్చాడు షాహిద్.
కెరీర్‌ను కష్టంగా గడుపుతున్న షాహిద్ కపూర్‌కు సక్సెస్‌ను తెచ్చిపెట్టింది 'కబీర్ సింగ్'. ఈ మూవీ షాహిద్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించినదానిగా నిలిచిపోయింది. ఇక ఈ హీరో త్వరలోనే 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో తనకు, తన భార్య మీరాకు జరిగిన ఓ గొడవ గురించి బయటపెట్టాడు షాహిద్.
షాహిద్ కపూర్ నటించిన 'ఉడ్తా పంజాబ్' సినిమా ఎన్నో అవార్డులను అందుకోవడంతో పాటు తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇందులో షాహిద్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. అయితే ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు వెళ్లిన మీరా.. అందులో షాహిద్ క్యారెక్టర్ నిజమనుకొని తనను వదిలేస్తానని చెప్పిందట. కానీ అదంతా సినిమా అని షాహిద్ రిక్వెస్ట్ చేయడంతో నార్మల్ అయ్యిందట. ఇదంతా చాలా ఫన్నీగా జరిగిందని అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు షాహిద్ కపూర్.