Shamita Shetty, Raqesh Bapat : వన్ ఇయర్ కలిసున్నాం. ఇక విడిపోతున్నాం.. బిగ్‌బాస్ జోడీ బ్రేకప్..
Shamita Shetty, Raqesh Bapat : వారిద్దరి పరిచయం బిగ్‌బాస్ షోలో జరిగింది. OTTలో స్ట్రీమ్ అయిన ఈ షోలో బాలీవుడ్ హీరోయిన్ షమితా శెట్టి, హీరో రాకేష్ బాపట్ ప్రేమలో పడ్డారు. ఏడాది పాటు కలిసున్నారు.. కానీ అంతలోనే ఏమైందో విడిపోతున్నట్లు ప్రకటించారు..;
Shamita Shetty, Raqesh Bapat : వారిద్దరి పరిచయం బిగ్‌బాస్ షోలో జరిగింది. OTTలో స్ట్రీమ్ అయిన ఈ షోలో బాలీవుడ్ హీరోయిన్ షమితా శెట్టి, హీరో రాకేష్ బాపట్ ప్రేమలో పడ్డారు. ఏడాది పాటు కలిసున్నారు.. కానీ అంతలోనే ఏమైందో విడిపోతున్నట్లు ప్రకటించారు..
షమితా శెట్టి మరియు రాకేశ్ బాపట్ బిగ్ బాస్ OTT హౌస్‌లో డేటింగ్ ప్రారంభించారు. రాకేష్ బిగ్ బాస్ 15లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కనిపించాడు. ఇక్కడ షమితా ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది. అయితే రాకేశ్ అనారోగ్య కారణాలతో షో నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో వారిద్దరూ విడిపోతున్నట్లు రూమర్లు వచ్చాయి. "షమితా శెట్టి మరియు రాకేష్ బాపట్ విడిపోయారు. వారు కలిసి ఒక వేదిక కోసం మ్యూజిక్ వీడియో చేస్తున్నందున సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు" అని అందరూ అనుకున్నారు.
షమితా శెట్టి, రాకేష్ విడిపోయిన విషయాన్ని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాకేష్, నేను కొంతకాలం నుంచి విడిగా ఉంటున్నాము. కానీ మేము చేసిన మ్యూజిక్ వీడియోని ఆదరిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదములు.. ఇక ముందు కూడా మీ ప్రేమను మాకు అందించండి.. మీ అందరూ మాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. మీ అందరి మద్దతు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ మ్యూజిక్ వీడియో మీ అందరికీ అంకితం చేస్తున్నాను." అని షమితా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వెల్లడించింది.
అయితే ఇంతకుముందు సోషల్ మీడియాలో తమ బ్రేకప్ పుకార్లను షమిత కొట్టిపారేసింది. "మా సంబంధానికి సంబంధించిన ఎలాంటి పుకార్లను నమ్మవద్దని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇందులో ఎలాంటి నిజం లేదు అని అప్పుడు చెప్పుకొచ్చింది.
ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, షమిత రాకేష్‌తో తన సంబంధాన్ని గురించి తెలిపింది. "మేమిద్దరం వేర్వేరు వ్యక్తులం, కొన్ని విషయాలపై ఘర్షణ పడుతున్నాము. చాలా కాలం తర్వాత నేను ఒక రిలేషన్లోకి వచ్చాను. అతడి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను అని రాకేష్ గురించి వివరించింది.
కాగా, షమితా శెట్టి నటి శిల్పా శెట్టి సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కొన్ని అవకాశాలు వచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు. బిగ్‌బాస్ ఓటీటీలోకి అడుగు పెట్టాక షమిత పేరు ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు బ్రేకప్‌తో మరోసారి తెరపైకి వచ్చింది.