Ram Charan : మెగా ఫ్యాన్స్ ప్రిపేర్ అయిపోయినట్టేనా..

Update: 2024-11-11 12:30 GMT

ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన ఒక అప్డేట్ వస్తోందంటే అంచనాలు పెంచేలా ఉంటుందనే భావిస్తారంతా. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం కూడా ఫ్యాన్స్ అలాగే చూశారు. ఎంత లేట్ అయినా ఓపిక పట్టారు. దీపావళికి టీజర్ ఇస్తున్నాం అని మళ్లీ పోస్ట్ పోన్ అని చెప్పినప్పుడూ సంయమనం పాటించారు. ఓ అద్భుతమైన టీజర్ వస్తోందని మేకర్స్ కూడా ఊరించారు. చెప్పినట్టుగానే చివరి డేట్ కు రిలీజ్ అయిన ఈ టీజర్ చూసి మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఉసూరుమన్నారు. దీనికోసమా ఇన్నాళ్లూ ఎదురు చూసింది అని నిట్టూరుస్తున్నారు. నిజానికి ఈ టీజర్ లో కంటెంట్ కు సంబంధించిన అప్డేట్ ఏం కనిపించలేదు. భారీ షాట్స్, విజువల్స్ తో నింపేశాడు శంకర్. కియారా అద్వానీ తో మూడు పాటలున్నాయని, అంజలి జానపద కళాకారిణిగా, శ్రీకాంత్ సీనియర్ పొలిటీషియన్ గా, సునిల్ అమాయకుడు పాత్రలోనూ కనిపించబోతున్నాన్న మేటర్ అర్థం అయింది. అంతే కానీ.. సినిమాపై ఆసక్తిని పెంచే కంటెంట్ అంటూ అస్సలేం కనిపించలేదు అనేది నిజం. ఈ నిజం తెలిసినా మెగా ఫ్యాన్స్ కామ్ గా ఉన్నారంటే కారణం ట్రైలర్ వరకూ వేచి చూద్దాం అనే వైఖరే. పైగా ఈ చిత్రానికి రెండు ట్రైలర్స్ విడుదల చేస్తారు అనే టాక్ ఉంది. ఫస్ట్ ట్రైలర్ లో విషయం ఉంటే రెండో ట్రైలర్ అవసరం లేదు.

ఏదేమైనా శంకర్ కారణంగానే ఈ గేమ్ ఛేంజర్ రిజల్ట్ గురించి మెగా ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతున్నారనే అంటున్నారు. అందుకు ప్రధాన కారణం ఈ టీజరే అని తేల్చేస్తున్నారు. ఇంకా చెబితే రిజల్ట్ విషయంలో ప్రిడిక్టబుల్ గానే ఉన్నారట.

Tags:    

Similar News