Shanmukh Father : వాళ్లు కలుస్తారు.. అంతా శుభమే జరుగుతుంది : షణ్ముఖ్ తండ్రి
Shanmukh Father : బిగ్‌బాస్ సీజన్ 5 మొత్తంలో షణ్ముఖ్ జశ్వంత్‌కి ఫుల్ సపోర్ట్‌గా నిలిచిన దీప్తి సునయన బయటకు వచ్చాక మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది.;
Shanmukh Father : బిగ్‌బాస్ సీజన్ 5 మొత్తంలో షణ్ముఖ్ జశ్వంత్‌కి ఫుల్ సపోర్ట్‌గా నిలిచిన దీప్తి సునయన బయటకు వచ్చాక మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. షణ్ముఖ్‌తో బ్రేకప్ అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీనితో వీరిద్దరూ అభిమానులు కంగారు పడ్డారు. ఈ క్రమంలో వారి అభిమానులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఇద్దరు కలుస్తారంటూ షణ్ముఖ్ తండ్రి ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"బ్రేకప్ దీప్తి చెప్పింది, కానీ షణ్ముఖ్ ఎక్కడా చెప్పలేదు. ఇది వారి వ్యక్తిగత విషయం.. మనము ఎక్కువగా మాట్లాడకూడదు.. అయితే దీప్తికి ఏం అనిపించిందో తెలీదు కానీ సోషల్ మీడియాలో అలా పోస్ట్ పెట్టింది. వారు కలుసుకోవడానికి టైం పడుతుంది కావచ్చు కానీ తప్పకుండా కలిసే ఉంటారు. అంతా శుభమే జరుగుతుంది. ఈ విషయంలో అభిమానులు అనుమానించాల్సిన అవసరంలేదు" అని చెప్పుకొచ్చారు. అయితే వీరిద్దరూ కలుస్తారా లేదా అన్నది చూడాలి మరి.