ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతను నటించిన నారీ నారీ నడుమ మురారి అనే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరో ప్రాజెక్ట్ సెట్స్ లో ఉంది. ఇక కాక గతంలోనే సంపత్ నంది డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ అయింది. ఆ మూవీ ఇవాళ్టి(బుధవారం) నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళుతుందని చెబుతూ టైటిల్ తో పాటు అప్డేట్ ఇచ్చింది టీమ్. ఈ చిత్రానికి అందరికీ కనెక్ట్ అయ్యేలా ‘భోగి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. భోగి అనగానే మనకు సంక్రాంతి పండగ గుర్తొస్తుంది. అందుకే ఈ టైటిల్ క్యాచీగా ఉండటంతో పాటు అందరికీ నచ్చేలానూ కనిపిస్తోంది.
టైటిల్ తో పాటు పాటు విడుదల చేసిన ఫస్ట్ స్పార్క్ వీడియో చూస్తే శర్వా ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ మిస్ కాడు అనిపిస్తోంది. ఆదిలాబాద్, మహరాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో సాగే కథగా ఈ చిత్రాన్ని రాసుకున్నాడు సంపత్ నంది. పైగా 1960లో సాగే కథట. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ అంటే బడ్జెట్ గట్టిగానే ఉంటుంది. ఆల్రెడీ ఈ మూవీలో హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతీలను తీసుకున్నారు. అనుపమ, శర్వా కలిసి గతంలో శతమానం భవతి చిత్రంలో నటించారు. డింపుల్ కు శర్వాతో ఫస్ట్ మూవీ. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందబోతోన్న ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నాడు. ఫస్ట్ స్పార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. కానీ ఎవరు చేస్తున్నారో టైటిల్స్ లో వేయలేదు టీమ్.
ఇక అన్నిటికంటే విశేషం ఏంటంటే ఈ భోగిని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తారట. ఆ మేరకు టైటిల్స్ కూడా అన్ని భాషల్లో వేశారు. ఏదేమైనా శర్వానంద్ కు ఈ రేంజ్ మాస్ స్టోరీ ఇప్పటి వరకూ చేయలేదు. మరి ఈ భోగి ఎలా ఉంటుందో చూడాలి.