Shefali Jariwala : విషాదం.. బిగ్ బాస్ నటి మృతి

Update: 2025-06-28 06:04 GMT

వెండితెరపై వెలిగిపోవాలని ఎన్నో కలలు కని అవె నెరవేరకుండానే కళ్లు మూసేవాళ్లు చాలామందే ఉంటారు. కొందరు ప్రమాదవశాత్తూ మరణిస్తే.. మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. ఆ దురదృష్టంతో మృతి చెందింది బాలీవుడ్ నటి షెఫాలి జరీవాలా. తనెవరూ అనుకుంటున్నారా.. కొన్నాళ్ల క్రితం 'కాంటా లగా'అనే మ్యూజిక్ వీడియతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది తనే. ఆ తర్వాత అనేక పాటల్లో కనిపించింది. కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే హిందీ బిగ్ బాస్ సీజన్ 13లో పాల్గొని మరింత పాపులర్ అయింది. మరికొన్ని టివి షోస్ లోనూ కనిపించింది.కన్నడలో పునీత్ రాజ్ కుమార్ నటించిన హుడుగురు అనే సినిమాలో స్పెషల్ సాంగ్ లోనూ నర్తించింది.

షెఫాలీ 2004లో హర్మీత్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. 2009లో ఇద్దరూ విడిపోయారు. తర్వాత 2014లో పరాగ్ త్యాగిని పెళ్లాడింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ముంబైలో ఉంటున్నారు.ఈ శుక్రవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో తనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే భర్త హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. కానీ అప్పటికే తను మరణించిందని వైద్యులు ధృవీకరించారు.

కాకపోతే తను హార్ట్ ఎటాక్ తోనే మరణించిందా లేక ఇంకేదైనా సమస్యా అనేది పోస్ట్ మార్టమ్ లో తేలుతుందని చెప్పారు. అదే సమయంలో తను కూపర్ హస్పిటల్ కు వెళ్లేప్పటికే మరణించింది. అయితే అంతకు ముందే ఆమెను భర్త పరాగ్ త్యాగి వేరే హాస్పిటల్ తీసుకువెళ్లి ఉన్నాడట. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా ఒకే పాటతో దేశం మొత్తం పాపులర్ అయిన షెఫాలి కేవలం 42 యేళ్ల వయసులోనే కన్నుమూయడం విషాదం. 

Tags:    

Similar News