Lavanya : శేఖర్ బాషా లావణ్యను తన్నాడా? లావణ్య అనుచరులు శేఖర్ ను కొట్టారా? ఏం జరిగిందంటే?
నటుడు రాజ్ తరుణ్ - లావణ్య కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది. తాజాగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నటి లావణ్య ఫిర్యాదు చేశారు. ఆర్జే శేఖర్ బాషా తనపై దాడి చేశారంటూ ఫిర్యాదులో తెలిపింది. తనపై పదే పదే శేఖర్ బాషా ఆరోపణలు చేస్తుండడంతో ప్రశ్నించేందుకు వెళ్లగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఆఫీసులో తనపై దాడి జరిగిందని ఫిర్యాదులో వివరించారు. తనను చూడగానే విచక్షణ రహితంగా కొట్టాడని, కడుపుపై తన్నాడని లావణ్య చెప్పారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. సాక్ష్యాధారాలు పరిశీలిస్తున్నారు.
మరోవైపు.. లావణ్య అనుచరులు తనను తీవ్రంగా కొట్టారంటూ ఆరోపిస్తున్నారు శేఖర్ బాషా. హైదరాబాద్ లోని ఆ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారాయన. ఆయన కంప్లయింట్ పై పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
హీరో రాజ్ తరుణ్ తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ లావణ్య జులై 5న నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా వీరిద్దరి వివాదంలోకి ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు. దీంతో కథ కొత్తమలుపు తిరిగింది. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు శారీరక సంబంధం ఉందని, అలాగే ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అమాయకులైన యువతకు ఆమె మత్తుపదార్థాలు అలవాటు చేసిందని సంచలన విషయాలు వెల్లడించారు. దీనిపై పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చారు. ఇంటర్వ్యూలో శేఖర్ బాషా ఆమెపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా ఆగ్రహానికి గురైన లావణ్య ఒక్కసారిగా అతడిపై చెప్పుతో దాడి చేయడం సంచలనం రేపింది.