Shiva Movie : మళ్లీ హిట్ కొట్టిన శివ

Update: 2025-11-15 10:21 GMT

శివ మూవీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది. శివకు ముందు శివకు తర్వాత అనే టాక్ కూడా చెప్పారు. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మళ్లీ విడుదలైంది. ఈ సారి 4కే డాల్బీ అట్మాస్ సౌండ్ ను యాడ్ చేసి ఆడియన్స్ కు ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు వర్మ. శివ కోసం మరోసారి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఫైనల్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చాడు శివ, నాగ్ అండ్ టీమ్.శివ అంటే కేవలం నాగార్జున మూవీ మాత్రమే కాదు.. అన్నపూర్ణ స్టూడియోస్ మూవీ కాబట్టి ఆ మేరకు వర్క్ చేశారు.

ఫైనల్ గా ఈ శుక్రవారం మరోసారి విడుదల చేశారు టీమ్. ఎప్పట్లానే మంచి పేరు వచ్చింది మూవీ. కొత్తగా విడుదలైన మూవీస్ కు లాగానే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలాసార్లు టివిల్లో చూసిన మూవీ కాబట్టి డాల్బీ సౌండ్ మాత్రం అదిరిపోయింది. 4కే టెక్నాలజీ కూడా ఆకట్టుకుంది. ఇప్పటికీ సినిమా చాలా ఫ్రెష్ గా కనిపించడం మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. కొత్తతరం ఆడియన్స్ కూడా ఈ మూవీకోసం తెగ చూస్తున్నారు. అందుకే మొదటి రోజు 2.5 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా గ్రాస్ గా ఈ మొత్తం కలెక్షన్స్ చూస్తే శివపై ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉందే అర్థం చేసుకోవచ్చు. ముందు ముందు మరిన్ని వసూళ్లు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంచనాలు వేస్తున్నారు. 

 

Tags:    

Similar News