సీనియర్ నటులు రాజశేఖర్, జీవితల కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ మంచి ఫేమ్ సొంతం చేసుకుంటున్న హీరోయిన్ శివానీ రాజశేఖర్.. తాజాగా మరో ప్రతిష్టాత్మకమైన సినిమాలో ఆమెకు చాన్స్ దక్కింది. 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' తో ఇస్రో సైంటిస్ట నంబి నారాయణన్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చిన మాధవన్ ఇప్పుడు మరో బయోపిక్ ప్రేక్షకులను పలకరించనున్నారు. 'ది ఎడిసన్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన జి.డి. నాయుడు బయోపిక్ లో ఆయన టైటిల్ పాత్ర పోషించనున్నారు. డైరెక్టర్ కృష్ణకుమార్ రామకుమార్ తెరకెక్కించనున్న ఈసినిమాలో ఆర్ మాధవన్తో పాటు శివానీ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ప్రియమణి, జయరాం, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ మూవీ టైటిల్ లోగోను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుండటంతో ఏర్పాట్లు స్పీడ్గా చేస్తున్నారు. జూన్ నుంచి శివానీ షూటింగ్లో పాల్గొననున్నారు. జి.డి.నాయుడు పూర్తి పేరు గోపాలస్వా మి దొరస్వామి నాయడు. కోయంబత్తూర్లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదు వుకున్న ఆయన.. ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టా ర్స్లో కొన్ని పరికరాల ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్ విప్లవం సృష్టించారు. ఇండియాలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటారున్ను రూపొందించింది ఆయనే. మిరాకిల్ మ్యాన్గానూ జీడీ నాయుడు గుర్తింపు పొందారు. ఆయన వృత్తిపరమైన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలతో పాటు పర్సనల్ లైఫ్ ఈ సినిమాలో చూపించనున్నారని సమాచారం. 1893లో జన్మించిన ఆయన 1974లో కన్నుమూశారు.