Shivathmika Rajashekar: బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోయిన స్టార్ కూతురు..! క్లారిటీ ఇచ్చిన నటి..
Shivathmika Rajashekar: హీరో రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లపై పలు రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.;
Shivathmika Rajashekar: సీనియర్ హీరోహీరోయిన్లు చాలావరకు తమ వారసులను ఇండస్ట్రీలోకి దించేశాడు. వారిలో కొందరు గుర్తింపు తెచ్చుకుని వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. మరికొందరు ఇంకా గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే సీనియర్ హీరో రాజశేఖర్ కూడా తమ కూతుళ్లు ఇద్దరినీ హీరోయిన్లుగా పరిచయం చేశాడు. తాజాగా ఆ ఇద్దరిపై పలు రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రాజశేఖర్, జీవితా వారసులు శివానీ, శివాత్మిక పలు సినిమాల్లో నటించి మంచి పేరునే తెచ్చకున్నారు. ముందుగా శివాత్మిక హీరోయిన్‌గా పరిచయమయినా.. తర్వాత నటిగా వచ్చిన శివానీనే ఎక్కువ ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ ఇద్దరిలో ఒకరు బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోయారు అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ తెగ చక్కర్లు కొట్టాయి. దీంతో ఓ ఇన్‌స్టా్గ్రామ్ పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది శివాత్మిక రాజశేఖర్.
ఇటీవల రాజశేఖర్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయి ట్రిప్‌లో ఉన్నాడు. ఇదే సమయంలో తన కూతుళ్లలో ఒకరిపై అలాంటి రూమర్స్ క్రియేట్ అయ్యాయి. దీంతో శివాత్మిక రాజశేఖర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 'వీళ్లతో నేను దుబాయ్‌కు వెళ్లాను. మరి నేను కానీ, శివానీ కానీ ఏ బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోయాం? శివానీ వెళ్లిపోయిందా? నేను వెళ్లిపోయానా? కొంచెం క్లియర్‌గా ఉండండి' అంటూ రూమర్స్‌కు చెక్ పెట్టింది శివాత్మిక.