తాను క్యాన్సర్ ను జయించానని కన్నడ నటుడు శివరా జుమార్ చెప్పారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. చికిత్స తుది దశకు చేరుకుందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశాడు. క్యాన్సర్ సోకిందని తెలిసిన తర్వాత ఎవరికైనా భయం వెంటాడుతుందని, ఆ భయం నుంచి తన సతీమణి గీత, అభి మానులు తనను ఆ భయం నుంచి దూరం చేశారని అన్నాడు. వారందరికీ రుణపడి ఉంటానని చెప్పారు. పూర్తి చేయాల్సిన సినిమాల కోసం ఎంతో కష్టపడ్డానని అన్నారు. ఓవైపు కీమో థెరపీ చేయించుకుంటూనే '45' సినిమా షూటింగ్ పూర్తి చేశానని వెల్లడించారు. అందరికీ నూతన సంవత్సర శు భాకాంక్షలు చెప్పిన శివరాజ్ కుమార్.. త్వరలోనే ప్రజల మధ్యకు రాబోతున్నట్టు తెలిపారు.