Nabha Natesh : నభా నటేష్ కు షాక్ ఇచ్చిన డార్లింగ్
యాక్సిడెంట్ తర్వాత కోలుకుని మళ్లీ టాలీవుడ్ లో పాగా వేయాలనుకున్న నభా నటేష్ ఆశలను ఈ శుక్రవారం విడుదలైన డార్లింగ్ మూవీ నెరవేర్చిందా..;
ఇస్మార్ట్ శంకర్ తో యూత్ హార్ట్స్ కొల్లగొట్టిన గ్లామరస్ బ్యూటీ నభా నటేష్ ( Nabha Natesh ) కొత్త సినిమా డార్లింగ్. ఈ శుక్రవారం విడుదలైన ఈమూవీపై తను చాలా హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే కొన్నాళ్ల తనకు యాక్సిడెంట్ అయింది. దీంతో కెరీర్ రైజ్ అవుతోన్న టైమ్ లో సడెన్ గా గ్యాప్ వచ్చింది. కోలుకున్న తర్వాత మళ్లీ నానా తంటాలు పడి కొత్త ఆఫర్స్ అందుకుంది. అలా అందుకున్న ఆఫర్స్ లోనిదే ఈ డార్లింగ్. ఈ సినిమా హిట్అయితే తెలుగులో తన కెరీర్ గాడిలో పడుతుందనుకుంది. బట్ అలా జరగలేదు. డార్లింగ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ అనే టాక్ వస్తోంది. ముఖ్యంగా నభా నటేష్ క్యారెక్టర్ ఇరిటేట్ చేసిందంటున్నారు. తమిళ హీరోయిన్ లాగా చాలా ఓవరాక్షన్ చేసిందనే కమెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.
నభా నటేష్ కు గ్యాప్ రావడానికి ముందు కూడా హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఉన్నాయి. డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో రూపంలో షాకులు తిన్నది. రీ ఎంట్రీ లాంటి డార్లింగ్ మూవీ కూడా దాన్ని కంటిన్యూ చేయడంతో అమ్మడిపై ఆటోమేటిక్ గా ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడుతుంది.
ఏదేమైనా మరోసారి టాలీవుడ్ లో తన లక్ చెక్ చేసుకుందాం అనుకున్న నభాకు డార్లింగ్ పెద్ద షాకే ఇచ్చింది. ఇక తన చేతిలో ఇప్పుడు నిఖిల్ తో నటిస్తోన్న స్వయంభు అనే సినిమా మాత్రమే ఉంది. మరి ఈ మూవీతో అయినా తను హిట్ అందుకుటుందా లేక బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.