బాలీవుడ్ స్టార్ క్వీన్ శ్రద్ధా కపూర్ కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉందిప్పుడు. స్త్రీ 2 బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పటి వరకూ అక్కడి మెగాస్టార్లు, భాయ్ లు, బాద్ షాలు చేయలేని విధంగా కేవలం హిందీలోనే ఈ చిత్రం 500 కోట్ల మార్క్ ను దాటి రికార్డులు క్రియట్ చేసింది. డే ఒన్ కలెక్షన్స్ రికార్డ్స్ కూడా ఈ మూవీపైనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి మరో పార్ట్ మొదలుపెట్టబోతున్నారు. అంటే స్త్రీ 3 అన్నమాట. ఇక బాలీవుడ్ క్రేజ్ ను అప్పుడప్పుడూ టాలీవుడ్ లో కూడా వాడుతున్నారు కదా. ముఖ్యంగా ప్యాన్ ఇండియా అంటే అక్కడి వారి సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. అందుకే కొన్నాళ్ల క్రితం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందే సినిమాలో శ్రద్ధా కపూర్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయి. బట్ ఇవి ఆమె వరకూ వెళ్లలేదు అనేది నిజం. ఇక్కడిక్కడే అనుకున్నారు. ఎవరికి వాళ్లు శ్రద్ధా కపూర్ నానితో నటించేందుకు ఒకే చెప్పింది అంటూ రాసుకున్నారు. ఇదే విధంగా ఇదే ప్రాజెక్ట్ కోసం ముందు జాహ్నవి కపూర్ కూడా ఒప్పుకుందనే వార్తలూ వచ్చాయి. బట్ వాటిని తను ట్రాష్ అని కొట్టి పడేసింది. దీంతో శ్రద్ధా కపూర్ చేస్తోంది అనే రూమర్స్ క్రియేట్ చేశారు. బట్ ఇప్పటి వరకూ మళ్లీ దాని గురించి పట్టించుకున్నవాళ్లే లేరు.
ఇక లేటెస్ట్ గా శ్రద్ధా కపూర్ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేయబోతోందనే కొత్త వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా రూమర్ కాదు. పుష్ప 2 టీమ్ శ్రద్ధా ను అప్రోచ్ అయ్యారట. కానీ తనింకా ఏం చెప్పలేదు. మాగ్జిమం చేయదు అనే అనుకుంటున్నారు. అదే టైమ్ లో ఫస్ట్ పార్ట్ లో సమంత చేసిన పాటకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అప్లాజ్ వచ్చిందో తెలుసు కాబట్టి చేసినా ఆశ్చర్యం లేదు. సో.. ఇప్పటి వరకైతే తను ఈ ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పలేదు. చెప్పదు అని కూడా లేదు. స్త్రీ 3 త్వరగా స్టార్ట్ అయితే నో చెప్పే అవకాశాలున్నాయి. మొత్తంగా ఇటు నాని మేటర్ పూర్తిగా రూమర్ అయితే.. పుష్ప 2 పార్శియల్ రూమర్. అదీ మేటర్.