పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి నటి శ్రేయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. లేటుగా స్పందించిన శ్రేయ పవన్ కల్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తింది. 'పవన్ విజయం విషయంలో నేనెంతో గర్వంగా ఉన్నా. మేమిద్దరం గతంలో 'బాలు' సినిమాలో
కలిసి నటించాం. అతను ఎంతో సైలెంట్. తన పని తాను చూసుకుంటారు. ఎంతో అంకిత భావం ఉన్న వ్యక్తి. బాలు లో ఓ పాట షూటింగ్ జరుగుతోన్న సమయంలో పవన్ కాలికి గాయమైంది. కానీ ఆ విషయం పాట షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకూ ఎవరికీ చెప్పలేదు. చెబితే షూట్ డిస్టర్బ్ అవుతుందని చెప్పకుండా దాచి పెట్టారు.పవన్ ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అది. ఇప్పుడు ఏపీ ప్రజలకు తన ఉత్తమమైన సేవలందిస్తారని ఆశిస్తున్నాను' అని తెలిపింది. ఇక శ్రియ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకెల్తోంది.బిజీ నటిగా కొనసాగుతుంది.