Shruti Haasan : పెళ్లిపై మాట మార్చేసిన శృతి హాసన్

Update: 2024-12-27 05:30 GMT

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పెళ్లిపై మాట మార్చేసింది. తాను పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదంటోంది. 'నేను రిలేషన్లో ఉండడాన్ని ఇష్టపడతాను. రొమాంటిక్గా ఉండడం ఇష్టం. నా చుట్టూ ఉండేవారితో చనువుగా ఉంటాను. ప్రస్తుతా నికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో ఎవరైనా నా మనసుకు దగ్గరైతే వారిని వివాహం చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా స్నేహితు లు, బంధువులు ఎంతోమంది వివాహానంతరం చాలా సంతోషంగా ఉన్నారు'అంటోంది. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రా యాలను పంచుకున్న శృతి ఇలా వివా హబంధంపై తన నిర్ణయాన్ని చెప్పారు. మీరు రిలేషన్ లో ఉన్నరా..? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి సింగిలే అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నానంటు న్నారు. ప్రస్తుతానికి పనిలో మునిగిపోయానని, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చె ప్పుకొచ్చింది శృతి.

Tags:    

Similar News