Shruti Haasan : భయంతోనే ఇండస్ట్రీకి వచ్చా.. అన్ లక్కీ, ఐరన్ లెగ్ అని అన్నారు : శృతిహాసన్
Shruti Haasan : హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన మొదట్లో అన్ లక్కీ, ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారని గుర్తుచేసుకున్నారు హీరోయిన్ శృతిహాసన్..;
Shruti Haasan : హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన మొదట్లో అన్ లక్కీ, ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారని గుర్తుచేసుకున్నారు హీరోయిన్ శృతిహాసన్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. భయంతోనే ఇండస్ట్రీకి వచ్చానని, అయితే హీరోయిన్ పాత్రలకు తాను సరిపోనని, వాయిస్ బాగోలేదని, సక్సెస్ కాలేవని అన్నారని గుర్తుచేసుకున్నారు.
ఇక తెలుగులో చేసిన మొదటి రెండు సినిమాలు (అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్)అంతగా ఆడకపోవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారని అన్నారు.. కానీ పవన్‌తో చేసిన గబ్బర్‌సింగ్ హిట్ కావడంతో గోల్డెన్‌లెగ్ అని పిలవడం స్టార్ట్ చేశారని, ఓవర్‌నైట్‌లో అంతా మారిపోయిందని చెప్పుకొచ్చింది శృతి.
మనపై ఇతరుల అభిప్రాయాలు వారికి తోచినట్లుగానే ఉంటాయి.. కానీ మనతో మనం నిజాయితీగా ఉండాలి.. అప్పుడే మన సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుందని ఇది తన నమ్మకమని చెప్పుకొచ్చింది శృతి.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది శృతి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న సాలార్ మూవీ, బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తోన్న మరో మూవీలో శృతి హీరోయిన్‌గా నటిస్తోంది.