Shruti Haasan Remuneration: షాకిస్తున్న శృతి హాసన్ రెమ్యునరేషన్.. చిరుకు ఒకలా.. బాలయ్యకు మరోలా..
Shruti Haasan Remuneration: శృతి హాసన్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. ఆ తరువాత స్ట్రాంగ్ కమ్ బ్యాకే ఇచ్చింది.;
Shruti Haasan (tv5news.in)
Shruti Haasan Remuneration: ఒకప్పటిలాగా సీనియర్ హీరోలకు సీనియర్ హీరోయిన్లే జోడీ అన్న రూల్ మారిపోయింది. కథ, క్యారెక్టర్ నచ్చితే సీనియర్ హీరోలతో జతకట్టడానికి కూడా వెనకాడట్లేదు యంగ్ బ్యూటీలు. అలా బ్యాక్ టు బ్యాక్ సీనియర్ హీరోల ప్రాజెక్ట్స్‌ను ఓకే చేస్తున్న వారిలో శృతి హాసన్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు శృతి హాసన్ ఇద్దరు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తుండగా.. అందుకోసం తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ మేకర్స్‌కు షాక్ ఇస్తోందట.
శృతి హాసన్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. ఆ తరువాత స్ట్రాంగ్ కమ్ బ్యాకే ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో శృతి హాసన్ పట్టిందల్లా బంగారమే అవుతోంది. తాను ఇటీవల నటించిన సినిమాలు చాలావరకు హిట్ టాక్‌నే అందుకున్నాయి. దీంతో సీనియర్ హీరోలు సైతం శృతితో జతకట్టడానికి సిద్ధమవుతున్నారు.
ముందుగా గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి హీరోయిన్‌గా ఎంపికయ్యింది శృతి హాసన్. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. గోపీచంద్ మలినేని, శృతి హాసన్ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సూపర్ హిట్ సినిమాలు ఉండగా ఇది వీరి హ్యాట్రిక్ చిత్రం. అయితే ఈ సినిమాలో నటించడానికి శృతి రూ. కోటిన్నర డిమాండ్ చేయగా.. చిరు సినిమా దగ్గరికి వచ్చేసరికి మాట మార్చేసిందట.
ఇటీవల చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం కోసం కూడా శృతి హాసన్నే హీరోయిన్‌గా ఎంపిక చేసింది మూవీ టీమ్. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టారే తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. అయితే బాలయ్య చిత్రం కోసం రూ. కోటిన్నర తీసుకుంటున్న శృతి.. చిరు సినిమాలో నటించడానికి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.