ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర చిత్రం ఈ అర్ధరాత్రి నుంచే థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమాలపై ఇండియాతో పాటు విదేశాల్లోనూ భారీ హైక్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ అనగానే అందరూ జాన్వీక పూర్ అనే భావిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. ఇందులో తండ్రిపాత్ర లో నటించే ఎన్టీఆర్ సరసన శృతి మరాఠీ నటిచింది. తారక్ కు తల్లిగా నటించిన శృతి మరాఠి. జుట్టుకి తె ల్లరంగు వేసుకుని వయసు మళ్ళిన దానిగా మాత్రమే కనిపించబోవడం లేదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కీలక మైన దేవర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో జూనియర్ తో సమానంగా ఈమెకూ ప్రాధాన్యం దక్కిందట. తన జాతి వారి కోసం పోరాడే భర్తకు అండగా నిలబడే క్యారెక్టర్ లో మంచి ఎమోషన్స్ పడ్డాయని టాక్. రెండో సగంలో మాత్రమే ఈమె లుక్ మారిపో తుంది. శృతిది గుజరాత్. పలు హిందీ, మరాఠి సినిమాలు, సిరీస్, సీరియళ్లలో సపోర్టింగ్ రోల్స్ చాలా చేసింది.