Shweta Basu Prasad : తెలుగు సినిమా సెట్‌లో నన్ను ఎగతాళి చేశారు: శ్వేతా బసు ప్రసాద్

Update: 2025-02-17 11:00 GMT

‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్న సమయంలో తన ఎత్తును గుర్తు చేస్తూ సెట్‌లోని వారు ఎగతాళి చేసినట్లు తెలిపారు. ‘‘కెరీర్‌ విషయంలో నేను సంతృప్తిగానే ఉన్నా. నాకు నచ్చిన సినిమాలు చేశాను. ప్రస్తుతం టెలివిజన్‌ ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. కెరీర్‌ పరంగా ఇబ్బందిపడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్‌లో చాలా ఇబ్బందిపడ్డా. హీరోతో పోలిస్తే నేను ఎత్తు తక్కువగా ఉన్నానని సెట్‌లో ఉన్న ప్రతిఒక్కరూ నన్ను ఎగతాళి చేసేవారు. హీరో ఆరడుగులు ఉంటే ఈవిడేమో 5 అడుగులు ఉందని అనేవారు. ఇక, హీరోతో వచ్చిన సమస్య మరో స్థాయిలో ఉండేది. అతను ప్రతి సన్నివేశాన్ని మార్చేస్తుండేవాడు. గందరగోళానికి గురి చేసేవాడు. రీటేక్స్‌ ఎక్కువగా తీసుకునేవాడు. తెలుగులో డైలాగ్స్‌ చెప్పలేకపోయేవాడు. నిజం చెప్పాలంటే నాక్కూడా తెలుగు సరిగ్గా రాదు. కానీ, నేను ఏదోఒకరకంగా డైలాగ్స్‌ నేర్చుకొని షూట్‌లో నెట్టుకొచ్చేదాన్ని. అతను మాత్రం అలా కాదు. మాతృభాష తెలుగే అయినప్పటికీ అతనికి భాషపై కంట్రోల్‌ లేదు కానీ, నన్ను మాత్రం నా కంట్రోల్‌లో లేని నా ఎత్తు గురించి కామెంట్‌ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది కదా. దానికి నేనేం చేసేది. నాకు తెలిసి నేను అంత బాధపడిన సెట్‌ ఏదైనా ఉందంటే అదే’’ అని శ్వేతా బసు ప్రసాద్‌ అన్నారు. ఈ బ్యూటీ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకొని తెలుగు సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తున్నారు.

Tags:    

Similar News