Yodha OTT : ఓటీటీలోకి వచ్చేసిన యోధ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

Update: 2024-04-27 05:51 GMT

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'యోధ'. దిశా పటానీ, రాశీ ఖన్నా ఈ సినిమాలో హీరో యిన్లుగా నటించారు. సుమారు పదకొండేళ్ల తర్వాత బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా.. 'యోధ'పై భారీ అంచనాలు పెట్టుకుంది. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించగా.. సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా.. మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.

కానీ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్లుగా రాణించలేదు. సుమారుగా రూ.55 కోట్లు బడ్జెట్‌ పెడితే.. రూ.32 కోట్లు మాత్రమే తిరిగొచ్చాయి. యాక్షన్ సీన్స్‌ అంతగా ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేదని నెటిజన్లు చెప్పుకొచ్చారు. ఫైనల్‌గా ఏప్రిల్‌ 26న ఓటీటీలోకి యోధ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన రూ.349లకు స్ట్రీమింగ్ అవుతుంది. మే 10 నుంచి ఉచితంగా చూడొచ్చని ప్రకటించారు. ప్లాప్‌ అయిన సినిమాకు ఇంత డబ్బు చెల్లించడం ఎందుకు..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సలార్‌, యానిమల్‌ లాంటి హిట్‌ సినిమాలకు కూడా ఇలాంటి షరతులు లేవని విమర్శిస్తున్నారు.

విమానం హైజాక్ నేపథ్యం లో ఈ సినిమా రూపొందింది. ఇందులో ఎయిర్ఫోర్స్ అధికారి అరుణ్ కథియాల్ పాత్రలో సిద్ధార్థ్ కనిపించాడు. ఒక విమా నాన్ని టెర్రరిస్ట్లు హైజాక్ చేయగా.. వారిని అరుణ్ కథియాల్ ఎలా రక్షించాడు..? ఇదే సమయంలో రాశీఖన్నా, దిశా పటానీ పాత్రలు తన చుట్టూ ఎలా తిరుగుతాయి..? అనే అంశంతో సినిమా ఉంటుంది.

Tags:    

Similar News