స్టార్ బాయ్ సిద్ధు హీరోగా నటిస్తోన్న మూవీ ‘తెలుసు కదా’.ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలుగా పరిచయం అవుతోంది. రాఖిఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీపై మొదటి నుంచి చాలా పాజిటివ్ బజ్ ఉంది. ఓ ఫ్రెష్ కంటెంట్ తో నీరజా కోన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టుగా టాక్ ఉంది.అలాగే డిజే టిల్లు, డిజే టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఆ జోష్ లో ఉన్నాడు సిద్ధు. మధ్యలో జాక్ అనే మూవీ ఇబ్బంది పెట్టింది. కానీ జానర్ పరంగా చూస్తే తెలుసు కదా కొత్తగా ఉండేలా కనిపిస్తోంది. పైగా ఈ మూవీలో అతని టిల్లు మార్క్ కంటెంట్ ఉండకపోవచ్చు అంటున్నారు.
ఇక తెలుసు కదా మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది టీమ్. దసరా పండగ తర్వాత అక్టోబర్ 17న తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. దసరా టైమ్ లో బాక్సాఫీస్ ఫుల్ బిజీగా ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు ఉంటాయి. ఆ రష్ లో రావడం కంటే ఇలా తర్వాత వస్తే.. అప్పటికే దసరా అయిపోయి గ్యాప్ ఉంటుంది. ప్రేక్షకులూ కొత్త సినిమాలు కోరుకుంటారు. అలాంటి వారికి తెలుసు కదా లాంటి మూవీస్ మంచి ఛాయిస్ అవుతాయి. అందుకే ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నారేమో. సో.. తెలుసు కదా.. అక్టోబర్ 17న ఆడియన్స్ ముందుకు వస్తోందన్నమాట.