Sidhu Weds Aditi : సిద్ధు వెడ్స్ అదితి..

Update: 2024-09-16 10:03 GMT

హీరో సిద్ధార్థ్, హీరోయిన అదితి రావు హైదరి పెళ్లి అయిపోయింది. వనపర్తి సంస్థానంలో ఉన్న పురాతన దేవాలయంలో వీరి పెళ్లి అత్యంత గోప్యంగా జరిగింది. అంటే కేవలం లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యనే పెళ్లి తంతు ముగించిందీ జంట. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ను మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అదితికి చిన్న వయసులోనే పెళ్లి అయింది. కొన్నాళ్లకే విడిపోయారు. సిద్ధుకు కూడా గతంలో పెళ్లైందని చెబుతారు. కానీ అతను ఒప్పుకోడు.


అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన మహా సముద్రం టైమ్ లో వీరు ప్రేమలో పడ్డారు. ఆ సినిమాలో జంటగా నటించారు. కథలో సిద్ధు అదితిని మోసం చేసి వెళ్లిపోతాడు. కానీ నిజ జీవితంలో మాత్రం ఆ ప్రేమను పెళ్లి వరకూ తెచ్చాడు. కొన్ని రోజుల క్రితమే ఇదే ప్లేస్ లో తమ పెళ్లి ఉంటుందని చెప్పారు. చెప్పినట్టుగానే మూడు ముళ్ల తంతు పూర్తయింది. జంట బావుంది. మరి ఈ నూతన జంటకు మనమూ శుభాకాంక్షలు చెబుదాం. 



Tags:    

Similar News