అరుదైన వినికిడి లోపంతో బాధపడుతున్న సింగర్ అల్కా యాగ్నిక్
ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ ఇటీవలే తనకు అరుదైన ఇంద్రియ నాడీ నరాల వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొంది.;
ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ ఇటీవలే తనకు అరుదైన ఇంద్రియ నాడీ నరాల వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొంది.
సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. "నా అభిమానులు, స్నేహితులు, అనుచరులు మరియు శ్రేయోభిలాషులందరికీ. కొన్ని వారాల క్రితం, నేను విమానం నుండి బయటికి వెళుతున్నప్పుడు, నేను ఏమీ వినలేకపోతున్నాను అని అర్ధమైంది. వైద్యులను సంప్రదిస్తే నాకు అరుదైన వినికిడి లోపం ఉందని వివరించారు. దాదాపుగా కొన్ని వారాల నుంచి కలవట్లేదని మిత్రులందరూ నన్ను అపార్ధం చేసుకుంటున్నారు. అందుకే నా స్నేహితులు మరియు శ్రేయోభిలాషులందరి కోసం నేను ఇప్పుడు మౌనాన్ని వీడాలనుకుంటున్నాను." "ఇది వైరల్ అటాక్ కారణంగా అరుదైన ఇంద్రియ నాడీ నరాల వినికిడి లోపంగా నిర్ధారించబడింది...ఈ ఆకస్మిక ఎదురుదెబ్బ నాకు పూర్తిగా తెలియకుండా పోయింది. నేను దానిని అంగీకరించడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా నన్ను అర్ధం చేసుకోండి. నాకోసం ప్రార్ధనలు చేయండి అని పోస్ట్ లో తెలిపింది.
"నా అభిమానులు మరియు యువ సహోద్యోగుల కోసం, ఎక్కువ సౌండ్ ఉన్న పరికరాలు వాడొద్దని, హెడ్‌ఫోన్‌ల లో ఎక్కువ సేపు ఉండొద్దని హెచ్చరించింది.
అల్కా యాగ్నిక్ బాలీవుడ్‌లో సుప్రసిద్ధ గాయని. తన వర్క్‌ఫ్రంట్ గురించి మాట్లాడుతూ, 58 ఏళ్ల గాయని ఇటీవల విడుదలైన 'క్రూ' మరియు 'అమర్ సింగ్ చమ్కిలా' చిత్రాలలో పాటలకు తన గాత్రాన్ని అందించింది.