Singer Chinmayi : అతడితో జాగ్రత్త.. ఒంటరిగా ఎప్పుడూ వెళ్లకు: నటిని హెచ్చరించిన చిన్మయి
Singer Chinmayi : సింగర్ చిన్మయి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. గాయనిగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది.;
Singer Chinmayi : సింగర్ చిన్మయి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. గాయనిగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. గాయనిగా కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మీ టూ ఉద్యమం నేపథ్యంలో చిన్మయి బాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో నిర్మాత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియా వేదికగా పలు సామాజిక సమస్యలపై కూడా చిన్మయి స్పందిస్తూ ఉంటుంది.
అంతేకాదు యువత, మహిళలకు సూచనలు ఇవ్వడంతో వారిలో ధైర్యం నింపుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఓ నటిని హెచ్చరించింది. ఓ ప్రముఖ తమిళ నిర్మాతతో కలిసి చిన్మయి ఆమెకు వార్నింగ్ ఇచ్చి సూచనలు చేసింది. తమిళ నటి, వీజే అర్చన అర్చన ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆ సమయంలో షూటింగ్ సెట్‌కి వచ్చిన నిర్మాత వైరముత్తును ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది అర్చన.
ఈ ఫోటోలపై చిన్మయి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఇలా మొదలవుతుంది. అతనితో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇలా ఒంటరిగా కలవకండి. మీ వెంట ఎవరైనా ఉండేలా చూసుకోండి.. జాగ్రత్తగా ఉండండి' అని అర్చన పోస్ట్‌పై వ్యాఖ్యానించింది చిన్మయి. ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. నటి చిన్మయి శ్రీపాద, ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది.