Ravindra Berde : గుండె పోటుతో 'సింగం' నటుడు మృతి

గత కొన్ని నెలల నుంచి గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు రవీంద్ర బెర్డే

Update: 2023-12-13 07:05 GMT

అనేక హిందీ, మరాఠీ చిత్రాలలో నటించిన ప్రముఖ నటుడు రవీంద్ర బెర్డే డిసెంబర్ 13న గుండెపోటుతో మరణించారు. ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో గొంతు క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితమే ఆయన డిశ్చార్జ్ అయ్యారు. బెర్డే మరణించే సమయానికి అతనికి 78 ఏళ్లు. అతను దివంగత నటుడు లక్ష్మీకాంత్ బెర్డే సోదరుడు.

పలు నివేదికల ప్రకారం, బెర్డే కొన్ని నెలల నుంచి గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. సరైన చికిత్స కోసం ఇటీవలే ముంబైలోని టాటా హాస్పిటల్‌లో చేరాడు. రెండు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి పంపగా ఈ రోజు ఉదయం ఒక్కసారిగా గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడిచారు. బెర్డేకు భార్య, ఇద్దరు పిల్లలు, కోడలు, మనవడు ఉన్నారు. కాగా బెర్డే కుటుంబం ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

రవీంద్ర బెర్డే గురించి

రవీంద్ర బెర్డే 100 కంటే ఎక్కువ చిత్రాలలో కనిపించారు. 2001 కల్ట్ ఫిల్మ్ 'నాయక్: ది రియల్ హీరో'లో అనిల్ కపూర్‌తో కలిసి పనిచేశారు. అంతేకాకుండా, అతను రోహిత్ శెట్టి బ్లాక్ బస్టర్ చిత్రం 'సింగం'లో జమీందార్ చంద్రకాంత్ పాత్రను కూడా పోషించాడు. ఇందులో అజయ్ దేవగన్ టైటిల్ పాత్రలో నటించాడు.

హిందీలోనే కాదు, మరాఠీ చిత్ర పరిశ్రమలోనూ బెర్డే అత్యంత ప్రసిద్ధికెక్కారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, అతను అశోక్ సరాఫ్, విజయ్ చవాన్, విజు ఖోటే, సుధీర్ జోషి, భరత్ జాదవ్ వంటి అనేక మంది ప్రముఖ నటులతో వివిధ ప్రాజెక్టులలో స్క్రీన్‌ను పంచుకున్నారు.

Tags:    

Similar News