Mohammed Siraj : ఇంగ్లాండ్ భరతం పట్టిన సిరాజ్.. 407 రన్స్‌కే ఆలౌట్

Update: 2025-07-05 08:00 GMT

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 407 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ ఇంగ్లీష్ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ 19.3 ఓవర్లు బౌలింగ్ చేసి 70 పరుగులకు 6 వికెట్లు పడగొట్టగా, ఆకాష్ దీప్ తన 20 ఓవర్లలో 80 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. జామీ స్మిత్ ఇంగ్లాండ్ తరపున 184 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడగా, హ్యారీ బ్రూక్ కూడా 158 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్ 407 కే ఆలౌట్

మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ ల బౌలింగ్ ధాటికి ఇంగ్లాండ్‌పై భారత్ 180 పరుగుల ఆధిక్యంలో ఉంది. 77/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్, ఆరంభంలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లో మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ కు వరుసగా రెండు వికెట్లు తీశారు. ముందుగా సిరాజ్ జో రూట్ (22)ను పెవిలియన్ కు పంపగా, ఆ తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ ను అవుట్ చేశాడు.

303 పరుగుల భాగస్వామ్యం

84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కు హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ ల ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం కొంత ఉపశమనం కలిగించింది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 368 బంతుల్లో 303 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సమయంలో, జేమీ స్మిత్ 80 బంతుల్లో తన రెండవ టెస్ట్ సెంచరీని సాధించగా, హ్యారీ బ్రూక్ 137 బంతుల్లో తన తొమ్మిదో టెస్ట్ సెంచరీ చేశాడు.

సిరాజ్ దాడి

మూడవ సెషన్‌లో.. ఆకాష్ దీప్ హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేయడంతో వారి భాగస్వామ్యం బ్రేక్ అయ్యింది. బ్రూక్ 234 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్ తో 158 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే సమయంలో, స్మిత్ 207 బంతుల్లో 21 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 184 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడో సెషన్‌లో స్మిత్ కాకుండా ఆకాష్ దీప్ క్రిస్ వోక్స్ వికెట్ తీసుకున్నాడు. దీని తర్వాత, సిరాజ్, బ్రైడాన్ కార్సే, జోష్ టోంగ్, షోయబ్ బషీర్‌లను పెవిలియన్ కు పంపించాడు. ఈ ముగ్గురు ఖాతాలు కూడా తెరవకుండానే ఔట్ అయ్యారు.

Tags:    

Similar News