Sitara Ghattamaneni : మహేష్ కూతురా మజాకా.. కళావతి పాటకి అదిరిపోయే స్టెప్పులు..!
Sitara Ghattamaneni : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
Sitara Ghattamaneni : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజైన కళావతి పాట సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.. "వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ" అంటూ సాగే ఈ పాటకి సంగీత ప్రియులు వన్స్ మోర్ అనేస్తున్నారు.. ఎవరి నోట విన్న ఇప్పుడు ఇదే పాట వినిపిస్తోంది. అంతలా అందరి మైండ్ లో రిజిస్టర్ అయిపొయింది ఈ పాట.
అయితే ఈ పాటకి స్టెప్పులేసి ఆదరగోట్టింది మహేష్ కూతురు సితార.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ సితార.. అచ్చం డాడీలాగే చేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమన్ స్వరపరిచిన ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు.
ఇక పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ఈ సినిమాని మే 12న రిలీజ్ చేయనున్నారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.