Actress Sneha : అజిత్ నా ఫేవరేట్ హీరో అంటున్న స్నేహ

Update: 2025-06-19 12:00 GMT

అందం, అభినయంతో అభిమానులను సొంతం చేసుకున్న నటి స్నేహ. పక్కింటి అమ్మాయిలా కనిపించే స్నేహ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తొలి వలపు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రియమైన నీకు సినిమాతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. స్నేహ ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తోంది. మొన్నామధ్య అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర భార్యగా కనిపించగా, ఆ తర్వాత వినయ విధేయ రామలో రామ్ చరణ్ కు వదిన పాత్రలో నటించింది. రీసెంట్ గా డ్రాగన్ సినిమాలో డాక్టర్ పాత్రలో కూడా స్నేహ మెరిసింది. రీసెంట్ గా గోట్ సినిమాలో విజయ్ కి భార్యగా నటించిందీ అమ్మడు. స్నేహ తమిళంలో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో అజిత్ తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది. విజయ్, కమల్, సూర్య, అజిత్, ప్రశాంత్, ధనుష్ తోనూ స్నేహ కలిసి నటించింది. ప్ర స్తుతం సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటున్న స్నేహ ఎంతో ఆచితూచి వ్యవహరిస్తోంది.

Tags:    

Similar News