తెలుగు సినిమాలకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. దాంతో ఇతర భాషలకు చెందిన నటీనటులు తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నుండి అనేక మంచి హీరోయిన్స్ తెలుగులో నటిస్తున్నారు. దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్స్ సైతం తెలుగు సినిమాలు చేస్తున్నారు. తాజాగా మరో అగ్ర నటి సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి . వరుస సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు సరసన సోనాక్షి నటిస్తుందని తెలిసింది. గత ఏడాది హరోం హర, మా నాన్న సూపర్ హీరో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధీర్ బాబు. ఆయన తాజాగా ప్రతిష్టాత్మకమైన సినిమా జటాధర చేస్తున్నారు. ఇది. మైథాలాజీ నేపథ్యం ఉన్న సినిమా. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నమారు. తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హానటిస్తుందని సమాచారం. ఇదేవారంలో సోనాక్షి జటాధర షూటింగ్ పాల్గొంటారని తెలిసింది. దీనిపై చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది. సోనాక్షి నటించడం వల్ల ఉత్తరాది ప్రేక్షకులు సైతం ఈ పట్ల ఆసక్తి చూపుతారని చిత్ర బృందం భావిస్తోంది. సోనాక్షి ఇంతకు ముందు రజనీకాంత్ లింగా అనే తమిళ సినిమా చేసింది. తెలుగు సినిమా చేయడం మాత్రం ఇదే ప్రథమం అవుతుంది.