బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తాజాగా ఓ ఈవెంట్లో స్టేజీపైనే కన్నీళ్లు పెట్టేసుకుంది. ర్యాంప్వాక్ పై నడుస్తూ ఎమోషనల్ అయ్యింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, దివంగత రోహిత్ బాల్ ను గుర్తు చేసుకుంటూ.. దండం పెట్టి మరి ఏడ్చేసింది. అయితే ఈ కార్యక్రమం లో పాల్గొనడానికి ముందు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'కళాత్మకత, దార్శనికత తో ఇండియన్ ఫ్యాషన్ రంగాన్ని లెజెండరీ రోహిత్ బాల్ ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. ఆయన్ని గుర్తు చేసుకుంటూ ర్యాంప్పైకి అడుగుపెట్టడం భావోద్వేగంగా ఉంది. ఇది స్ఫూర్తి దాయకమైన ప్రయాణం' అని ఆమె పేర్కొన్నారు. ఇక 2023లో విడుదలైన 'బ్లైండ్' తర్వాత సినిమాలకు దూరమైన సోనమ్.. ప్రస్తుతం అనుజా చౌహాన్ రాసిన బ్యాటిల్ ఫర్ బిట్టోరా నవల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు మధుర్ భండార్కర్, ఫ్యాషన్ డిజైనర్ జేజే వలయా, నటి ఈషా గుప్తా, నటుడు రాహుల్ దేవ్, ముగ్ధా గోడ్సే కూడా ఈ దివంగత ఫ్యాషన్ డిజైనర్‌కు నివాళులు అర్పించడానికి ర్యాంప్‌పై నడిచారు. కాగా ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ గత సంవత్సరం నవంబర్‌లో 63 ఏళ్ల వయసులో మరణించారు.