ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఏ క్షణమైనా హెల్త్ బులెటిన్
ఎస్పీ బాలు ఆరోగ్యంపై అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. MGM ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. బాలు ఆరోగ్యం..;
ఎస్పీ బాలు ఆరోగ్యంపై అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. MGM ఆస్పత్రి వర్గాలు ఏ క్షణమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందని నిన్నే వైద్యులు చెప్పడంతో తాజా పరిస్థితిపై అందర్లో ఆందోళన నెలకొంది. రెండ్రోజులుగా జ్వరం తగ్గకపోవడం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ పెరగడం వల్లే నిన్న ఒక్కసారిగా పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. ప్రస్తుతం 10 మంది స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో బాలుకు చికిత్స కొనసాగుతోంది. ఎక్మో, వెంటిలేటర్‌పై ఉన్న బాలును చూసేందుకు కాసేపట్లో తమిళనాడు ఆరోగ్యమంత్రి MGMకు రానున్నారు. ఆ తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని తెలుస్తోంది.