మామూలుగా సౌత్ లో సీక్వెల్స్ ఆడవు అనే సెంటిమెంట్ ఉండేది ఒకప్పుడు. దాన్ని మొదట బద్ధలు కొట్టింది రాఘవ లారెన్స్. తన ముని చిత్రానికి సీక్వెల్ గా తీసిన కాంచనతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు కాంచనను ఓ ఫ్రాంఛైజీగా మార్చాడు. త్వరలోనే కాంచన 4 రాబోతోంది. తర్వాత బాహుబలి, బాహుబలి 2తో రాజమౌళి బిగ్గెస్ట్ హిట్స్ అందుకుని సీక్వెల్స్ సెంటిమెంట్ ను తుడిచేశాడు. రీసెంట్ గా పుష్ప 2 అది మరోసారి ప్రూవ్ చేసింది. ఇలా నాని కూడా హిట్ మూవీని ఫ్రాంఛైజీగా మార్చాడు. లేటెస్ట్ గా వచ్చిన హిట్ 3 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తోంది. ఈజీగా 150 కోట్ల వరకూ కలెక్ట్ చేయొచ్చు అనే అంచనాలున్నాయి.
హిట్ 3 కలెక్షన్స్ ఎలా ఉన్నా.. ఈ మూవీ చూసిన వాళ్లందరికీ ఒక డౌట్ మాత్రం మిగిలిపోతుంది. హిట్ 2 చివర్లో నాని ఎంట్రీ ఇచ్చాడు. థర్డ్ పార్ట్ లో అతను హీరో. ఇప్పుడు హిట్ 3 చివర్ లో తమిళ్ హీరో కార్తీ ఎంట్రీ ఇచ్చాడు. డిసిపి వీరప్పన్ గా కేమియో రోల్ లో కనిపించాడు. సో 4వ భాగంలో అతను హీరోగా నటించబోతున్నాడని ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చినట్టే కదా. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది మరో డౌట్.
ప్రస్తుతం కార్తీ లైనప్ చూస్తే సర్దార్ 2, వా వాతియార్ అనే చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇవి కాక మరో రెండు సినిమాలు ఓకే చేసి ఉన్నాడు. అలాగే ఖైదీ2 కూడా ఉంటుంది. అవన్నీ అయ్యాక హిట్ 4 చేయాలంటే మూడేళ్లైనా పడుతుంది. మరి అప్పటి వరకూ శైలేష్ కొలను ఈ కథను హోల్డ్ చేయగలడా.. అసలు కథ చెప్పే కార్తీని ఒప్పించారా లేక కథ నచ్చితేనే చేయొచ్చు.. ప్రస్తుతానికి కేమియో మాత్రం చేయమని అడిగారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా ఉంటే మాత్రం ఖచ్చితంగా కార్తీకి కూడా ఓ పెద్ద విజయం వచ్చినట్టే అనుకోవచ్చు.