Viral Photo: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?
Rare Pic: టాలీవుడ్ హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.;
NTR: టాలీవుడ్ హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి. ఇలాంటి వాటిపై సినీప్రియులు ఎప్పుడూ ఆసక్తికనబరుస్తారు. తాజాగా ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటో ఎవరిదో కాదు, తెలుగు చిత్రసీమ ఖ్యాతిని నలుదిశలా చాటిన మహానుభావుడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహోన్నత శిఖరం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్...ఆయన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ విద్యార్థిదశలో ఉన్న ఫోటో చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోలో ఎన్టీఆర్ ఫ్యాంట్, షర్ట్, షర్ట్ పైన కోటు, షూస్, చేతికి గడియారంతో.. కనిపించాడు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడు. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్లు ఎలా ఉంటారు? అంటే ప్రతి ఒక్కరికి మనసులో కదలాడే రూపం ఆయనదే. ఈ ఫోటో మీరు కూడా చూడండి.