పెళ్లిసందడితో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి గుంటూరు కారంతో ఒక ఊపు ఊపేసిన నటి శ్రీలీల. కొన్ని ఫ్లాప్స్ పడ్డా కూడా శ్రీలీల జోరు కంటిన్యూ అవుతోంది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ నుంచి ఈ అమ్మడికి సినిమా ఆఫర్ వచ్చింది, దాన్ని ఈమె కాదన్నది అనే వార్తలు వచ్చాయి.బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలను సంప్రదించారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అందుకు ఆమె తిరస్కరించిందనే వార్తలు కూడా వినిపించాయి. శ్రీలీల హిందీ సినిమా విషయమై అసలు విషయం క్లారిటీ వచ్చింది. వరుణ్ ధావన్ నటిస్తున్న సినిమాని నిర్మిస్తున్న రమేష్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మా సినిమా కోసం ఏ ఒక్క హీరోయిన్ ను సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు. ‘వరుణ్ ధావన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణతో మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. అప్పటి వరకు హీరోయిన్ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. హీరోయిన్ ను ఎంపిక చేసిన వెంటనే మీడియాకి తెలియజేస్తాం.'అని ప్రకటించారు. దీంతో ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కాదనేది తేలిపోయింది. అయితే ప్రస్తుతానికి తెలుగు మరియు తమిళ సినిమాలతో శ్రీలీల బిజీగానే ఉంది.