Sridevi: ఆ సినిమాలో రజనీకాంత్ కంటే శ్రీదేవికే ఎక్కువ పారితోషికం..
Sridevi: శ్రీదేవి ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్.. సమ్మోహనపరిచే రూపం, నటనలో అభినయం ఆమె సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.;
Sridevi: శ్రీదేవి ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్.. సమ్మోహనపరిచే రూపం, నటనలో అభినయం ఆమె సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు శ్రీదేవి ప్రయాణం అద్భుతంగా సాగింది. ఆమె స్టార్ హీరోలు అందరితో కలిసి పనిచేసింది. ఇదిలా ఉంటే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాకే రజనీకాంత్ కంటే శ్రీదేవికే ఎక్కువ పారితోషికం ఇచ్చారట నిర్మాతలు. ఈ విషయాన్ని శ్రీదేవి స్వయంగా ఓ షోలో వెల్లడించారు.
50 ఏళ్ల సినీ ప్రయాణంలో శ్రీదేవి ఎందరో ప్రముఖ నటీనటులతో కలిసి పనిచేశారు. ఆమె 4 సంవత్సరాల వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. 1976 సంవత్సరంలో, ఆమె కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'మూండ్రు ముడిచ్చు' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది.
ఆ సినిమాలో రజనీకాంత్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నట్లు శ్రీదేవి చెప్పారు. ఈ చిత్రానికి కమల్ హాసన్ రూ.30 వేలు, రజనీకాంత్‌కి రూ. 2000, తనకు రూ. 5000 ఇచ్చారని చెప్పారు. ఆ సమయంలో రజనీకాంత్, శ్రీదేవి ఇద్దరూ కొత్తవారు. అయితే అప్పటికే కమస్ హాసన్ హీరోగా ఫేమస్ అయ్యారు.