తెలుగులో వరుసగా ఫ్లాపులు వచ్చాయి.దీంతో శ్రీలీల ఫోకస్ అంతా కోలీవుడ్ అండ్ బాలీవుడ్ పైనే పెట్టింది. తెలుగు నుంచి చేసిన చివరి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సైతం ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీంతో తెలుగుకు ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలాగని తమిళ్ లో ఏమైనా బావుందా అంటే అదీ లేదు. తమిళ్ తెరంగేట్రం చేసిన మూవీ పరాశక్తి డిజాస్టర్ గా మారింది. అయినా తమిళ్ నుంచి మరో రెండు ఆఫర్స్ పట్టేసింది. అందులో ఒకటి ధనుష్ తో చేస్తోంది. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఈలోగా మరో సీనియర్ హీరో అజిత్ కుమార్ తో రొమాన్స్ కు రెడీ అయింది.
అజిత్ కుమార్ తో మూవీ అంటే మాటలు కాదు కదా. అతను తమిళ్ టాప్ హీరోస్ లో ఒకడు. చాలా పెద్ద హీరోగా వెలుగుతున్నాడు. కాకపోతే ప్యాన్ ఇండియా టైప్ మాటలేం కాకుండా కేవలం తమిళ్ లో మాత్రమే మూవీస్ చేస్తూ ఉన్నాడు. అతను హీరోగా శ్రీలీల ఇప్పుడో సినిమా చేయబోతోంది. ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. అధిక్ రవిచంద్రన్ డైరెక్టర్. విశేషం ఏంటంటే.. ఈ మూవీకి నిర్మాత కూడా అజిత్ కుమారే. అఫ్ కోర్స్ పేరు మాత్రమే అతనిది డబ్బులు మాత్రం వేరే వ్యక్తి పెట్టబోతున్నాడట. అదీ విషయం. మరి శ్రీలీలకు ఈ మూవీ అయినా హిట్ అయితే అమ్మడు తమిళ్ లో లోనే పాగా వేస్తుందేమో చూడాలి.
అన్నట్టు అజిత్ కుమార్ నే సీనియర్ హీరో అంటే అంతకంటే నాలుగేళ్లు పెద్దవాడు కూడా అయిన రవితేజతో చేసిందీ బ్యూటీ. అదీ కాకుండా అతనితో ఏకంగా రెండు సినిమాలు కూడా చేసి ఉంది.అందుకే అజిత్ తో అనగానే వెంటనే ఒప్పేసుకుంది.