Love Insurance Kompany : లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఇంత దారుణమా..?

Update: 2026-04-09 07:50 GMT

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (L.I.K).విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. మామూలుగా అయితే ప్రదీప్ రంగనాథన్ మూవీస్ అంటే ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ కనిపిస్తుంటాయి. పైగా మనోడు ఆరంభం నుంచే హ్యాట్రిక్ కొట్టి ఉన్నాడు. లవ్ టుడే, డ్రాగన్, డూడ్ మూవీస్ తో ఒకదాన్ని మించి ఒకటి విజయాన్ని అందుకున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు తెలుగులోనూ బాగా వర్కవుట్ అయ్యాయి. ఆ కారణంగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీపై భారీ అంచనాలుంటాయి అని భావించారు. బట్ అలాంటిదేం లేదు. ఈ మూవీకి మినిమం ఓపెనింగ్స్ కూడా వచ్చేలా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. కేవలం వందలు, వేలల్లో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి. విశేషం ఏంటంటే.. ఇది తెలుగులో కాదు.. తమిళ్ లో. తమిళ్ లోనే ఇలాంటి పూర్ ఓపెనింగ్స్ అంటే దారుణమే. ఇది ఎవరూ ఊహించని స్థాయిలో ఉండటం మాత్రం చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీపై ఆడియన్స్ మినిమం ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అనేది వాస్తవం. విఘ్నేశ్ శివన్ అంటే డైరెక్టర్ గా కాస్త ఫేడవుట్ స్టేజ్ లో ఉన్నాడు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆడియో పరంగా హిట్ కాలేదు. కాకపోతే ట్రైలర్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది. కృతిశెట్టి మాంచి గ్లామర్ పాత్రలో కనిపించబోతోంది. ఎక్స్ పోజింగ్ హద్దులు చాలానే దాటేసినట్టు ఉంది. అవన్నీ ఎలా ఉన్నా.. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం దయనీయమైన స్టేజ్ లో ఉండటం చూస్తే సినిమా రిజల్ట్ ఏంటీ అనేది కూడా అర్థం అవుతోంది.

అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఉండటం కారణం.. తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి అని సర్ది చెప్పుకుంటారేమో. కానీ ఈ మూవీకి యూత్ అయినా ఇంట్రెస్ట్ గా ఉన్నారు అంటే అదీ లేదు. ఎన్నికలు ఉన్నా.. యూత్ సినిమాల విషయంలో ఇబ్బందిగా ఉండరు కదా. అదీ విషయం. ఏదేమైనా ఈ మూవీకి టాక్ వచ్చేదాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అనేది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News