SS Rajamouli : జపనీస్ వీడియో గేమ్ లో రాజమౌళి

Update: 2025-07-15 11:00 GMT

ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళి అప్పుడప్పుడూ తన సినిమాల్లో స్క్రీన్ పై కనిపిస్తుంటాడు. ఓ సారి నాని మూవీలోనూ కనిపించాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో మూవీ చేస్తున్నాడు. రాజమౌళి సినిమా అంటే తెలుసు కదా.. నెలల తరబడి సాగుతూ ఉంటుంది. ఓ పట్టాన ఏదీ ఓకే చేసుకోడు. అందుకే లేట్ అవుతుంది. అయినా పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తో వస్తుంటాడు. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో ప్రపంచం మొత్తానికి మోస్ట్ టాలెంటెడ్ ఇండియన్ డైరెక్టర్ గా పరిచయం అయిన రాజమౌళి ఇప్పుడు ఓ జపనీస్ వీడియో గేమ్ లో నటించబోతున్నాడు. యస్.. బట్ ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. ఓ కేమి రోల్ అన్నమాట. అది కూడా ఆర్ఆర్ఆర్ వల్లే సాధ్యం కావడం విశేషం.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ టైమ్ లో రాజమౌళి జపాన్ లోని కొజిమా స్టూడియో కు వెళ్లాడు. అప్పటి పరిచయం తో వాళ్లే ఆయన్ని పర్సనల్ గా ఈ పాత్ర కోసం స్కాన్ చేశారు. ‘డెత్ స్ట్రాండింగ్’ అనే వీడియో గేమ్ కు సీక్వెల్ గా వస్తోన్న ‘డెత్ స్ట్రాండింగ్ 2 : ఆన్ ద బీచ్’ అనే పార్ట్ లో ఆయన కేమియో చేస్తున్నాడు. ఈ పాత్ర కోసం కొజిమా స్టూడియో పర్సనల్ గా ఆయన్ని స్కాన్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజమౌళి రేంజ్ అక్కడి వరకూ దర్శకుడుగా వెళ్లింది. కానీ ఇప్పుడు నటుడుగానూ మెప్పించబోతున్నాడు. వీడియో గేమ్ కాబట్టి రెగ్యులర్ యాక్టింగ్ లా ఉండదు. దీని మేకింగ్ వేరే ఉంటుంది. అందుకే ఈ స్కాన్. 

Tags:    

Similar News