Actore Vishal : స్టార్ హీరో విశాల్ నిశ్చితార్థం..అమ్మాయి ఎవరంటే?

Update: 2025-08-29 11:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. చెన్నైలోని తన నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రియురాలు, హీరోయిన్ సాయి ధన్షిక తో ఆయన నిశ్చితార్థం జరిగింది. ఈమేరకు విశాల్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించాడు. ‘నా బర్త్ డే సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజునే కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సాయి ధన్షికతో నాకు ఎంగేజ్ మెంట్ జరిగింది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్న' అంటూ పోస్ట్ చేశాడు. నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక ప్రస్తుతం విశాల్ 'మకుటం' మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన సాయి ధన్షిక రజనీకాంత్ కబాలి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారింది. ఇందులో సూపర్ స్టార్ కూతురిగా నటించడంతో అందరి కళ్లు ఈ ముద్దుగుమ్మపై పడ్డాయి. అనంతరం తమిళంతో పాటు తెలుగులో ఫుల్ బిజీగా మారింది ఈ అమ్మడు.

Tags:    

Similar News