తమిళ నటుడు కార్తీ నటిస్తున్న సర్దార్2 మూవీ షూటింగ్ సెట్ లో ప్రమాదం జరిగింది. ఫైట్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు 20 అడుగుల ఎత్తు నుంచి పడి స్టంట్ మ్యాన్ ఎజుమలై కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని మూవీ టీమ్ వెంటనే ఆస్పత్రికి తరలించింది. ఎజుమలై ఛాతీ భాగంలో తీవ్ర గాయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో అతడు మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ డైరెక్షన్ లో 2022లో వచ్చిన సర్దార్ మూవీకి సీక్వెల్ గా సర్దార్2 తెరకెక్కుతోంది.