Dhanush Aishwarya Divorce : ధనుష్, ఐశ్వర్యల మధ్య దూరం పెంచిన సుచిలీక్స్..!
Dhanush aishwarya Divorce : టాలీవుడ్ స్టార్ కపుల్స్ నాగచైతన్య, సమంత డైవర్స్ ఎంత హాట్ టాఫిక్ అయిందో అంతకుమించి కోలీవుడ్ కపుల్స్ ధనుష్, ఐశ్వర్యల బ్రేకప్ అందర్నీ షాక్‌కు గురిచేసింది.;
టాలీవుడ్ స్టార్ కపుల్స్ నాగచైతన్య, సమంత డైవర్స్ ఎంత హాట్ టాఫిక్ అయిందో అంతకుమించి కోలీవుడ్ కపుల్స్ ధనుష్, ఐశ్వర్యల బ్రేకప్ అందర్నీ షాక్‌కు గురిచేసింది. కోలీవుడ్‌లో ఓ స్టార్ కపుల్స్ విడిపోతున్నారని గతకొంత కాలంగా తమిళ సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఆ జంట ఎవరనేది ఇన్నాళ్లు సస్పెన్స్‌గా ఉంది. తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఆ సస్పెన్స్‌కు తెరదించారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ఎండ్‌కార్డు వేశారు. విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా స్వయంగా ధనుష్, ఐశ్వర్య వేర్వేరుగా వెల్లడించారు.
నిన్నా మొన్నటివరకు అనోన్య దంపతులుగా ఉన్న ధనుష్, ఐశ్వర్య ఇలా సడెన్‌గా బ్రేకప్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచినా... వారిద్దరి మధ్య పొరపొచ్చాలు ఎప్పటినుంచో ఉన్నాయని సన్నిహితులు చెబుతున్న మాట. వీరి బ్రేకప్‌కు ఇదే కారణం అంటూ కొన్ని రూమర్స్ వినపడుతున్నాయి. సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు వెలుగులోకి వచ్చి అప్పట్లో ఎంతో రసాభాస జరిగింది. అప్పుడే వీరి మధ్య పెద్ద గొడవ జరిగి దూరం పెరిగిందని వార్తలు వినిపించాయి. అయితే రజనీకాంత్ జోక్యంతో సర్దుకుని ఒకటిగా కనిపిస్తూ వచ్చారు.
ఇపుడు మరోసారి ధనుష్, ఐశ్వర్య మద్య మనస్పర్థలు పెరగడంతో ఇక చేసేది ఏమీ లేక విడిపోవడమే మంచిదని ఇద్దరూ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్య వీరి మధ్యలోకి వేరేవ్యక్తులు వచ్చారని... ధనుష్ వేరే హీరోయిన్‌తో సన్నిహితంగా ఉండటం ఐశ్వర్యకు నచ్చలేదని, అందుకే అప్పటి నుంచి ధనుష్‌కు దూరంగా ఉంటోందని తెలుస్తోంది. అయితే, ధనుష్ వైపు నుంచి మరో వెర్షన్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ప్రస్తుతానికి ఈ రూమర్ అయితే బాగా వైరల్ అవుతుంది.
ఇప్పటిదాకా రజనీకాంత్ ఈ విషయమై స్పందించలేదు. అయితే వీరిద్దరి బ్రేకప్ విషయంలో ఆయన చాలా బాధపడినట్లు తెలుస్తోంది. ఎల్లప్పుడు పాజిటివ్‌గా ఉండే రజనీకాంత్ ఎలా స్పందిస్తారన్నది ఫ్యాన్స్ లో ఉత్కంఠ పరుస్తోంది. ఆయన వ్యక్తిగత జీవితంలో ఇది ఊహించని పరిణామం అంటున్నారు. తలైవా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని ట్వీట్స్ చేస్తున్నారు.
ధనుష్, ఐశ్వర్యలకు 2004 నవంబర్ 18న వివాహం జరిగింది. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా 15 ఏళ్ల యాత్ర రాజా, 11 ఏళ్ల లింగరాజా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ధనుష్... త్రీ, నవమన్మధుడు, మారి, రఘువరన్ బీటెక్ వంటి పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ అనువాదం జరిగి సూపర్ సక్సెస్ అయ్యాయి. ధనుష్ చేస్తున్న ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ డబ్ అవుతుందంటే అతనికి తెలుగు ఫ్యాన్స్‌లో పాపులారిటీ ఏరేంజ్‌లో ఉందో చెప్పనక్కరలేదు.
సినీ ఇండస్ట్రీలో చాలా కాలం కాపురం చేసిన జంటలు ఇలా విడాకులు తీసుకోవడం అన్నది ఎప్పటినుంచో ఉన్నదే. ఇటీవల అమీర్ ఖాన్ - కిరణ్ రావు, హృతిక్ రోషన్ - సుసన్నే ఖాన్ విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ధనుష్ - ఐశ్వర్య కూడా వచ్చి చేరడం కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది.