తనకు టీబీ జబ్బు ఉందని, కానీ దీనిని సీక్రెట్‌గా ఉంచానని నటి సుహాసిని తెలిపారు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందనే భయంతో రహస్యంగా 6 నెలలపాటు చికిత్స తీసుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను 2సార్లు (6,36 ఏళ్లు) TBతో బాధపడ్డా. ఆ సమయంలో విపరీతంగా బరువు తగ్గి, వినికిడి శక్తి కూడా కోల్పోయా. ఆ తర్వాత దాని నుంచి కోలుకున్నా. ప్రస్తుతం టీబీ పై ప్రజలకు అవగాహన కల్పించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు. సుమలత, ఖుష్బూ, రేవతి, లిజీ, రేఖ, పూర్ణిమ.. ఇలా పలువురు హీరోయిన్స్‌తో ఇప్పటికీ మంచి స్నేహం మెయింటైన్ చేస్తుంటుంది సుహాసిని. అయితే సుహాసని చూడడానికి చాలా అందంగా, పద్దతిగా కనిపిస్తూ అందరి మనసులు దోచుకుంటుంది. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలరిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహాసిని ఆసక్తికర విషయాలు వెల్లడించి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ‘నాకు టీబీ సమస్య ఉంది. కానీ ఆ విషయం తెలిసిన తర్వాత కూడా భయంతో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారను. ఎవరికి ఈ విషయం తెలియకుండా ఆరు నెలల పాటు చికిత్స కూడా తీసుకున్నా అని సుహాసిని తెలిపింది.