Sai Pallavi: సాయి పల్లవిపై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్.. లేడీ పవన్ కళ్యాణ్ అంటూ..
Sai Pallavi: ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సాయి పల్లవి ఛీఫ్ గెస్ట్‌గా హాజరుకావడం ఇదే మొదటిసారి.;
Sai Pallavi: కోలీవుడ్, మాలీవుడ్ నుండి వచ్చి టాలీవుడ్‌లో సెటిల్ అయిపోయిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో చాలామంది వెంటవెంటనే ఆఫర్లతో బిజీగా గడిపేస్తున్నారు కూడా. కానీ అందులో అందరికంటే ఎక్కువగా ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ఇటీవల సాయి పల్లవి ఫాలోయింగ్‌పై ఓ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
సాయి పల్లవి మనస్తత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తనకు పాత్ర నచ్చితే.. హీరో ఎవరైనా.. వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించదు. అదే ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా.. తనకు పాత్ర నచ్చకపోతే.. రిజెక్ట్ చేయడానికి వెనకాడదు. ఈ మనస్తత్వంతోనే చాలామంది అభిమానులను సంపాదించుకుంది సాయి పల్లవి. అయితే తాజాగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సాయి పల్లవి ఛీఫ్ గెస్ట్‌గా హాజరయ్యింది.
శర్వానంద్, రష్మిక మందనా హీరోహీరోయిన్లుగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ఈ శుక్రవారం (మార్చి 4)న ప్రేక్షకుల ముందుకు రానుంది. పలువురు సీనియర్ నటీమణులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సాయి పల్లవి, కీర్తి సురేశ్, సుకుమార్ ఛీఫ్ గెస్ట్‌లుగా ఆహ్వానించింది మూవీ టీమ్.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ మాట్లాడుతూ.. సాయి పల్లవి పేరు ఎత్తగానే ఒక్కసారిగా ఆడిటోరియం అంతా అరుపులతో దద్దరిల్లిపోయింది. సాయి పల్లవి ఫాలోయింగ్ చూసి సుకుమార్.. లేడీ పవన్ కళ్యాణ్‌లాగా అనిపిస్తుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సాయి పల్లవి ఛీఫ్ గెస్ట్‌గా హాజరుకావడం ఇదే మొదటిసారి.