Sukumar with Chiranjeevi : కల నిజమైంది... మెగాస్టార్‌తో సుకుమార్..!
Sukumar with Chiranjeevi : వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో అచార్య సినిమాని ఫినిష్ చేసిన చిరు;
Sukumar with Chiranjeevi : వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో అచార్య సినిమాని ఫినిష్ చేసిన చిరు... ప్రస్తుతం రెండు సినిమాలను ఒకేసారి చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఇవే కాకుండా డైరెక్టర్ బాబీతో ఓ సినిమా, వెంకీ కుడుములతో మరో సినిమాకి సైన్ చేశారు చిరు.. ఇప్పుడు మరో టాలెంటెడ్ డైరెక్టర్ కి చిరు ఓకే చెప్పారు.
గతేడాది పుష్ప మూవీతో అదరగొట్టిన సుకుమార్ కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇది సినిమాకి కాదులెండి... ఓ కమర్షియల్ యాడ్‌లో చిరు నటించనున్నారు. దీనిని సుకుమార్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన యాడ్ అని తెలుస్తోంది. ఈ సందర్భంగా సుకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ లో కల నిజమైంది.. మెగాఫోన్. వివరాలు అతి త్వరలో అంటూ పోస్ట్ చేశాడు సుకుమార్.. ప్రస్తుతం పుష్ప్ - పుష్ప: ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సుకుమార్.