సుమంత్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా అనగనగా.. ఈ మూవీని థియేటర్లోకి తీసుకు రాకుండా నేరుగా ఓటీటీలోకి వదిలారు. ఈటీవీ విన్ లో ఈ సినిమా ప్లే అవుతోంది. థియేటర్లో విడుదల అయితే కమర్షియ ల్గా ఏ మాత్రం సక్సెస్ అయ్యేదో గానీ ఓటీటీలో మాత్రం చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రశంసలను దక్కించుకుంటోంది. ఇంటిల్లి పాది హాయిగా చూసుకునేలా ఉందంటూ టాక్ వచ్చేసిం ది. దీంతో అందరూ ఈ మూవీ చూసేందుకు ఇష్టం పడుతుండటంతో తాజాగా వంద మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుందట. ఈ విష యాన్ని మూవీ టీం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అలాగే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. సమాజంలో విద్య బోధనపై నిర సనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యా బోధనలో ఉండే వైపరీత్యాలపై సున్నితంగా సెటైర్లతో ఈ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా హీరో అక్కి నేని సుమంత్ యాక్టింగ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. కొత్తదనంతో కూడిన సినిమాలు చేసే విషయంలో ఎప్పుడూ ముందుండే సుమంత్ సరైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్, అనుహాసన్, రాకేశ్ రాచకొండ ఇతర కీలక పాత్రల్లో నటించారు. చందు రవి సంగీతం అందించాడు.